Lyrics
రా - కేదారగౌళ తా-త్రిపుట
శరణుం జొచ్చితి యేసునాధుండ - శక్తిీహీనతం గల్గె నా = దరణ మిమ్మిల
నెవ్వం బొందితి - దవ్వుసేయక కావవే !శరణు॥
1. కరుణం జూడుము కన్న తండ్రివి - కల్మషం బెడంబాపవే = మరణ మొందక
మున్ను నన్నిల - మార్పు నొందంగం జేయవే ॥శరణు॥
2. మొరను జెచ్చెర నాలకించుచు - మోము నా దెసం జూపవే = యురు
పదంబుల సేవం జేసెద - నుద్దరించుము కూర్మితో ॥శరణు॥
3. తామస క్రియలందు వాంఛలు- తాకకుండగం జేయవే = క్షేమమైన సువార్త
బోధల - సిద్ధపడి - విననీయవే ॥శరణు॥
4. శ్రమలు చాల కల్లి యున్నను - సైంప నేర్చుము సత్మృపన్ = గమిలి పోయెడి
'మాయ లోకపు - గాంతి నీరస మంచు నీ ॥శరణు॥
-చుజ్టిలి సమూయేలు
Section: 326 క్రైస్తవ జీవితము · Book page: 298