Lyrics
రా - భూపాళము (చాయ : మేలుకొనరే) తా-అట
ముక్తిం గనరే
ముక్తిం గనరే మీ మనంబుల - శక్తిగల రక్షకుని పలుకులు = ముక్తిసాధన
'ములకు మూలము - భక్తిగొని యానంద మొందరే ॥ముక్తి॥
1. పాపభారము క్రింద (శ్రమపడు - పాపులారా రండు నేనే = ప్రాపు నెమ్మది
మోకిడుదునని - పరమరక్షకుం డాన తిచ్చెను ॥ముక్తి॥
2. ఇచ్చయించెడు వాండు యిచటికి - వచ్చి జీవజలంబు రుచిగా = పుచ్చు
కొనుగా కనుచుం బల్మెను - సచ్చరితుండు మనుష్య పుత్రుండు ॥ముక్తి॥
3. ఆకసమునందుండి యిటు దిగి - లోకమునకు జీవము నొసంగునది =
ఈ కడనె యున్న దది నేనను - యేసు ప్రభు వాక్కు మధురాన్నము॥ముక్తి॥
4 నేనె మార్గము నేనె సత్యము - నేనె జీవము నావలననే = గాని యెవండును
తండ్రి యొద్దికి - రానలవిగాదని వచించెను ॥ముక్తి॥
ర, జీవజలము నుద్రావుటకు మో - భావన లనెడి పాత్ర ముంచుచు = చేవం
గొని పానించుచు నిరత - జీవమును వెలుఃగొంది బ్రతుకను ॥ముక్తి॥
6. ఎక్కడను యిటువంటి ప్రభువును - మక్కువను వేసారి వెతకిన = చిక్కంబో
దిటువచ్చి జూడుడి - గ్రక్కునను జేసట్టు డిప్పుడే ॥ముక్తి॥
Section: 326 క్రైస్తవ జీవితము · Book page: 296