Lyrics
రా- ముఖారి (చాయ : ఉన్నపాటున) తా-త్రిపుట
నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి - నా కిమ్ము శ్రీ యేసువా = లోక
రక్షక నన్ను నీ లోపల దాగి - వీంకతోడను నుండనిమ్ము సద్దుణ శీలా॥నాకై॥
1. చీలంబడిన నీదు ప్రక్క విడిచి పారు - జాలు జలము రక్తము = చాల నా
పాపపు తీర్పు పాపబిలమ్ము - చాలు రూపును మాపి నన్ను బావనుం జేయు
॥నాకై॥
2. నీదు న్యాయంబగు ప్రామన్య విధులను - నాదు సత్మృతి తృప్తిగా =
నాదరింపవు పారమార్థకమైనట్టి - నాదు నాసక్తి బాప్ప్రమును బారిన నాకు
॥నాకై॥
3. నేను జేసిన పాపములం డ్రుంప నెవరిని - గాన నేరను యేసువా = దీనుం
డనై వచ్చి నీ మేటి సిల్వను - మానక నే హత్తుకొనియెద సచ్చరిత ॥నాతై॥
4 కట్టం బుట్టము లేక పుట్టముకై యాశ - బుట్టి నీ యెడ వచ్చితి = నెట్టి
'సహాయము లేక నీపై మదిం - బుట్టి నీ సత్కృబుపం బొందంజూచెద నయ్య
॥నాకై॥
5. పరమకల్శషుండనై నే నీటి బుగ్గకుం -బరుగు లెత్తెద నిప్పుడు = పరమ
పావన నన్ను గడుగుము లేకున్న - మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర
నాకై!
“శబరి నారాయణస్వామి
Section: 326 క్రైస్తవ జీవితము · Book page: 296