← Back to Songs
Song #416
క్రీస్తు విశ్వాసుల కాశ్రయము
రాగం: ఖరహరప్రియతాళం: రూపకముఛాయ: మానవుల మేలుకొరకు✍ వనుప్రలేట్ దావీదు
Lyrics
రా - ఖరహరప్రియ (చాయ : మానవుల మేలుకొరకు) తా-రూపకము
నాధ యేసు నాధ క్రీస్తు - నాధ - నేననాధ = సాధు జనులం బ్రోచు
-సదయు నీ దయ కాదా ॥నాధ॥
1... గతిం దలంపని మూర్ధచిత్త - గమనుండనేం గానా = సతతముననుం గరుణం
ట్రోచెడు - గతియ నీవు కావా ॥నాధ॥
2. పాపమందు జననమైన - పామరుండ నేంగానా = దాపు జేరి వేండెద నా -
ప్రాపు నీవు గావా ॥నాధ॥
3. కుటిల బుద్ధిగల వాండను -క్రూరుండ నేంగానా = కటకట నను గని
కరించు - కరుణ నీది గాదా ॥నాధ॥
4. ఆది కర్త వీవు గావె - యఖిల లోకమునకును = బీదవారి నెల్లం బ్రోచు -
బిరుదు నీది గాదా ॥నాధ॥
5. సారమైన సత్యశాస్ర్ర - సార మోవు గావా = ఘోరమైన పాపి జనుల -
గోరి పిలువ లేదా ॥నౌధ॥
6. జీవ నాధారమైన - త్రోవ నీవు గావా = దేవదేవ యెహవా నా - దిక్కు నీవు
గావా ॥నాధ॥
-వనుప్రలేట్ దావీదు
దైవ సహాయము - నడిపింపు 327
Section: 326 క్రైస్తవ జీవితము · Book page: 296