Song #411
దైవసన్నిధి
Lyrics
రా - యదుకులకాంభోజి (చాయ : తనువు నాదిదిగో) తా-త్రిపుట
ఓ దేవ నేను నీ - దాపున నుండెదన్ - నీ దాపున నుండెదన్ = నా దేవ
నను లేపు - నవి సిల్వ శ్రమలైనన్ - నీ దాపున నుండు - నీ సేవకుని పాట
॥ఓ దేవ
1. బాటసారి లాగు - నేండు భానుండు గ్రుంకి - మేటి చీంకటి గ్రమ్మినన్ =
నేటి విశ్రాంతికి - జోటు బండయైనన్ - మాటిమాటికి గలలో సూటిగా
నినుందలంతు ॥ఓ దేవ॥
2. ఆకాశ మండల - మార్గంబు నెప్పుడు - నా కీవు చూపించుమా = నీ
కూర్మిచే నాకు. - జేకూరు నంతయు - లోకేశ్వరా దూత - లే కోరి నను
చిలువ ॥ఓ దేవ॥
3. నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని - ప్రాకటంబగు నెనరుతో =
భీకరము లైన - శోకంబు లను రాళ్లన్ - నీకు నాలయంబు - నేంగట్టె దను
గర్తా॥ఓ దేవ॥
4. సంతసంపు రెక్క - లెత్తి నాకమునందు - నెంత పైకి లేచినన్ = వింతగ
జ్యోతుల - వితతి మించి నేన - త్యంత మెగసినను నీ - చెంత కేగును బాట
॥ఓ దేవ॥
- వక్తలు నమాణేలు
Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 292