Lyrics
రా - శంకరాభరణము (దావీదు కీర్తన 46) తా-ఏక
దేవుండే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము = మ - హా వినోదుం
డాపదల స- హాయుండై నన్ బ్రోచును - అభయ - మభయ - మభయ
మెప్పు - డానంద - మానంద - మానంద మౌంగ ॥దేవుండే॥
1. పర్వతముల కదిలిన నీ - యుర్వి మారుపడినను = సర్వమున్ ఘోషించుచు
నీ - సంద్ర ముప్పొంగినన్ - అభయ - మభయ - మభయ ॥దేవుండే॥
2. దేవుం డెప్పు తోడుగాంగ - దేశము వర్ణిల్లును = ఆ - తావు నందు ప్రజలు
మిగుల - ధన్యులై వసింతురు - అభయ - మభయ - మభయ ॥దేవుండే॥
3. రాజ్యముల్ కంపించిన భూ - రాష్ట్రముల్ ఘోషించిన = పూజ్యుండౌ యెహోవా
వైరిం-బూని సంహరించును-అభయ-మభయ-మభయ ॥దేవుండే
4. విల్లు విఅచు నాయన తెగ - బల్లెము నజకు నాయన = చెల్లచెదర జేసి
రిపుల - నెల్లంద్రుంచు నాయనే అభయ - మభయ - మభయ ॥దేవుండే॥
5. విశాచి పూర్ణబలము నాతో - బెనుంగులాడ జడియును = నశించి
శత్రుగణము దేవు - నాజ్ఞ వలన మడియును - అభయ మభయ - మభయ
దేవుండే॥
6. కోటయు నాశ్రయమునై యా- కోబు దేవు డుండంగ = ఏటి కింక వెరవ
వలయు - నెప్పు నాకుం బండుగ -యభయ - మభయ - మభయ ॥దేవుండే॥
- వంతగాని పరదేశి
Section: 312 క్రైస్తవ జీవితము · Book page: 288