FaithWalk
← Back to Songs

Song #389

విశ్వాస ఫలితములు

రాగం: జంర్లూటితాళం: అట

Lyrics

రా - జంర్లూటి తా-అట

విశ్వాస ఫలితములు - విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా = విశ్వాస

వంతునికి - విశ్వమ్ములోపల మ - వశ్యమ్మొదవు క్రైస్తవా ॥విశ్వా

1... ఫలములన్నిటిలోన - ప్రాముఖ్యమైనట్టి - ఫలమది పాప క్షమమే = విలువైన

'యా ఫలము - గలుగు నరునికి ముక్తి - దొలగ దతనికి క్షేమమే ॥విశ్వా

2. దానములలోను ప్ర- ధానమనబడు సమా - ధానమును గల్గించును= మాని

తమ్ముగ సమా - ధానమును భువిదివుల - మహితుతో గల్గించును ॥విశ్వా॥

3. నరక పాత్రులమైన - నావంటి నీవంటి - దురిత జీవుల కెల్లను =

గొజతలన్నియు దీర్చ - నిరత జీవము నియ్య - నిశ్చయమ్మిది చెల్లును ॥విశ్వా॥

4 ముత్తెమ్మునకు వలెనె - మురికి గప్పంగబడిన - చిత్తమును చిత్రవిధిగా =

రత్నమువలె మిగుల - రంజిల్లం జేసెడి ప-విత్రాత్మ మనకొదవుగా ॥విశ్వా॥

5. మేరలేని దోష - కారులమై ప్రభుకు - దూరముగం దొలగియున్న = వారమగు

నను నిన్ను - చేరంగ బిలిచి కు - మారత్వమొసంగు నన్న ॥విశ్వా॥

6. సేగు క్రియలను జేసి - పోగొట్టుకొన్ఫట్టి - క్షేమ రాజ్యపు హక్కులన్‌ =

బాగుగ మనకిచ్చి - బాంధవ్య మొనరించు - భగవంతునికి మనకున్‌ ॥విశ్వా॥

Section: 302 క్రైస్తవ జీవితము · Book page: 276