FaithWalk
← Back to Songs

Song #381

నీవు నన్ను ఆశీర్వదింపని యెడల నిన్ను వెళ్లనియ్యను”

రాగం: తోడితాళం: రూపకము✍ ఛలిపాక ఇగన్నారము

Lyrics

రా-తోడి తా-రూపకము

నిన్ను నేను విడువను దేవ - నీవు నను దీవించు వరకు = నిన్ను నమ్మినవారల

నెల్ల - నీవు చక్కంగ దీవించెదవు ॥నిన్ను!

1. నేను శత్రువునై యుండంగ - నీవు నాపై నెనరు జూపి = దాన మిచ్చితివి

నా కొర కు - దారుండౌ నీ ప్రియ పుత్రుని ॥నిన్ను॥

2. త్రోవ దప్పి తిరుగుచుండ - దుడుకునైన నన్ను 6 గాంచి = ప్రోవంగోరి

మదిని నీవు - త్రోవను బెట్టితివి నన్ను ॥నిన్ను!

3. నాంటనుండి నేంటి వరకు - నాకు గల్గిన శోధనములలో = నేటుగా

ననుం గాచిన వాండవు - నీవు గావా, ఓ నా తండ్రి ॥నిన్ను!

4. ఇంత కాలము నన్ను గాచి - యింకను నన్ను విడువ వనుచు = సంత

సించి మదిని నేను - జక్కంగ నీ దరి జేరితిని ॥నిన్ను!॥

5. నీవు గాక యెవరున్నారు - నేలపైని నుం గాపాడం = చేవ లేని నాకు నీవు

- చేవ గలుగం జేయం గలవు ॥నిన్ను!

6. అడుగు వారి కిచ్చెద నంచు - నాన తిచ్చినావు గాన = నదిగెద నిను

సాహాయ్యంబు - నాత్మమై యున్నట్టి తండ్రి ॥నిన్ను!

7... నాదు ప్రార్థన లన్నియి నీవు - నీదు కృపచే నాలకించి = నీదు సరణిని నిల్చి

నన్ను - నేర్చు దనరంగ రక్షించితివి ॥నిన్ను॥

-ఛలిపాక ఇగన్నారము

ప్రార్టన 303

Section: 302 క్రైస్తవ జీవితము · Book page: 272