Lyrics
రా-రేగూప్తి (రాయ : ఖండించవలెను)
నా యేసు నాధా - నను జూడవే - నా జీవనాధా = నా యేసునాధ మా
- నవ పాప మోచక - నీ యనుగ్రహముచే - నిరతంబు భువిలోన
॥నా యేసు॥
1. వింటిని నేను - నా హృదయంబు - వింతం బొందంగను = మింటనుండి
నీవు - మేదిని కరుదెంచి - యెంటి నర్పించితి - వొనరంగ నా కొరకు
ఇనాయేసు॥
2. నీ యానతులను - నిజముగ మోరి - నే నుంటి మున్ను = నా యెదను
గుందుచు- నా పాపముల కొరకు - నీ యొద్దం జేరెద - నిజరక్షకుండ వనుచు
॥నా యేసు॥
3. నేనునీ నెనరు - రుచి జూచితి - నిది యెంతో తనరు = దీనుఃడ నగు నేను
- ధృడ కృతజ్ఞత (ప్రేమల్ - గానుపింపంగ నీ - కడకు వత్తును దేవ
॥నా యేసు॥
4. నే నశక్తుడను - నిను సేవింప - నిత్యంబు ధరను = గానం బ్రార్థనం బూని
- ఘనుఃడ వని నమ్ముచు - నానందమున వత్తు - ననిశంబు నీ దరికి
॥నా యేసు॥
5. దయ చేయు మయ్యా - సత్యాత్మను - దాసుని కిపుడు = దయచేసి శుద్ధాత్మం
- ద్వరగాం గల్గించుము - ప్రీయముగ నీ సేవ పెంపుసేయంగ శక్తి
॥నా యేసు॥
6. నీవు నాతోడ -నెప్పుడు నుందు - నిజ మొనగూడ = నీవు నాతో నుండ -
నిర్భయముగ నేను - ద్రోవం బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు ॥నా యేసు॥
= పలిపాక జగన్నారము
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 270