Lyrics
రా - ఆనందలైరవి తా-ఏక
ఓ మా తండ్రి నీదు నామము - నిత్య మెన్ను - చుండు గాక సకల లోకము
= క్షేమముగను విమలముగను - జెన్ను మిరగం బరలోక - ధాముండవై
'వెలయునట్టి - ధన్య సౌజన్యమాన్య ఓ మా తండ్రి॥
1. నీ రాజ్యంబు రా నిమ్ము - నీదు చిత్తము - నేటుగం బరలోకమందున = నే
రీతిగను జేయంబడునో - యీ భూలోకమందు నట్టి - దారి బొందం జేయవలెను
- ధర్మ మూర్తి సత్యవర్తి ఓ మా తండ్రి॥
2. నేటి యాహారంబు మాకుం - గరుణంజేసి - నేటి కిచ్చి సూటి పరచుమి -
'మేటి మా విరోధి జనుల - మే మెటుల క్షమింతు మటుల - మాటికిని క్షమింప
నీవె - మాకు వేరె లేరు సుమ్ము1ఓ మా తండ్రి॥
3. మమ్ము శోధనమునకు తేకుము - కీడునుండి - మరల జేయు మమ్ము
నేమనన్ = ఇమ్మగు బల మహిమ రా - జ్యమ్ములును సర్వకా - లమ్ము నీవే
మాదు ప్రార్థ - న నమ్ముం జేకొమ్ము ఆమేన్ ॥ఓ మా తండ్రి॥
విలియం దాన్
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 266