Lyrics
రా - హిందూస్మాని ముఖారి తా-జుల్వ
సాక్ష్య మిచ్చెద - మన స్వామి యేసు దేవు దంచు = సాక్ష్య మనంగం
గనిన వినిన - సంగతులను దెల్బుటయే - సాక్ష్య మిచ్చు కొబుకు నన్ను
స్వామి రక్షించె నంచు ॥సాక్ష్య॥
1. దిక్కు దెసయు లేని నన్ను - దేవు డెంతో కనికరించి = మక్కువతో నాకు
నెట్లు మనశ్శాంతి నిచ్చినాండో ॥సాక్ష॥
2. పల్లెటూళ్ల జనుల రక్షణ - భారము నాపైని గలదు - పిల్లలకును బెద్దల
కును - డ్రేమతో నా స్వానుభవము ॥సాక్షక॥
3. బోధ చేయలేను వాద -ములకుం బోను నాక దేల = నాధుం దేసు ప్రభుని
గూర్చి - నాకుం దెలిసినంత వరకు ॥సాక్ష్య॥
4 పాపులకును మిత్రుం డంచుం - బ్రాణ మొసంగి లేచె నంచుం = బావముల
క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ॥సాక్ష్య॥
5. చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన = ఘోరపాపు లైనం (క్రీస్తు -
కూర్మితో రక్షించు నంచు ॥సాక్ష్య॥
6 పరమత దూషణము లేల - పరిహసించి పలుకు టేల = ఇరుగు పొరుగు
వారి కెల్ల - యేసు క్రీస్తు దేవుం డంచు ॥సాక్ష్య॥
7... ఎల్లకాల మూరకుండ - నేల యాత్మ శాంతి లేక = తల్లడిల్లు వారలకును -
తండ్రి కుమా రాత్మ పేర ॥సాక్ష్య॥
Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 254