FaithWalk
← Back to Songs

Song #352

యేసు నా రక్షకుడు

రాగం: ముఖారితాళం: అట✍ రావి జార్‌ సుందరరావు

Lyrics

రా -ముఖారి తా-అట

వెలుగును రక్షణ కర్తయునగునా - బలమగు దేవుని స్తోత్రింతును = వెరువను

నేనిక నెవ్వరికిన్‌ - వెలుగైన యేసే నా దుర్గము

1. అగాధ చీకటి జలముల నుండి - అఖండమైన వెలుగు సృజించిన =

'యుగయుగంబుల నేలెడి ప్రభువు - యఘముల బాపి నను వెలిగించును॥వెలు॥

2. నా దీపమును వెలిగించు ప్రభువే - నా దరి చీకటిన్‌ వెలుగుగ మార్చును =

నా దోషము లెల్లను దన కాంతిలో - నాదరముగ కడిగి రక్షించును ॥వెలు॥

3. పలువిధ శోధనల్‌ నను జుట్టినను - విలువగు సంపద లంతరించినను

'వెలుగుదూత నాపై యురులొద్దిన - నలయక నిత్యము నడచెద వెల్లులో ॥|వెలు॥

4. తల్లిదండ్రులు విడచినగాని - యుల్లము భీతిలి భయమందినను = ఎల్ల

ప్రజలు నను ద్వేషించినను - ఎడబాయడునా - ప్రియుడగు యేసు ॥వెలు॥

5. క్రీస్తు యేసుడే లోకపు వెలుగని - వాస్తముగ గనుడి ప్రియులార =

శాశ్వతంబగు రాజ్యము చేర - సత్వరమాయన వెలుగును బొందరె ॥వెలు॥॥

-రావి జార్‌ సుందరరావు

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 252