FaithWalk
← Back to Songs

Song #351

యేసే రక్షకుండు

రాగం: సావేరితాళం: త్రిపుట✍ రావూరి లక్ష్రీనరరయ్యా

Lyrics

రా- సావేరి తా-త్రిపుట

నీ కన్న నింక వేరే - వేల్పులు లేరయ్యా - నిజముగా నా యేసువా = నీ

కరుణ యను నెనరుచేతను - నీదు సత్య సువార్త ద్వార - ప్రాకటంబుగ

నన్నుం బిలిచిన- లోక రక్షక నీకు మొక్కెద ॥నీ కన్న॥

రక్షణానందము 283

1. నిన్నుం దెలియక మున్ను - నన్య దైవంబుల - ననుసరించిన పాపము

అన్ని పెనగాని నాదు హృదయపుం - గన్ను € గ్రమ్మి ప్రకాశ మియ్యక -

యున్న నీ విమలాత్మ వరమున - నన్ను వెలిగించిన దయానిధి ॥నీ కన్న!

2. వదలక నేం జేయు - తుద లేని పాపము - వదలించి ననుం ట్రోచితి

తుదిదినంబునం గలుగు బాధలు దొలంగ జేయుట నీవ యని నా

హృదయమందున నా నిరీక్షణ - పదిలపరచిన భక్త పాలక ॥నీ కన్న॥

3. నీ వాక్యార్థము నాలో - నివసింప జేసి నీ - సేవకునిగం ట్రోవవే = నీవె

సత్యము నీవె జీవము - నీవె మార్గము నీవె ద్వారము - నీవు గాకిం కెవరు

లేరు - కావవే నను యేసునాయక ॥నీ కన్న

= రావూరి లక్ష్రీనరరయ్యా

Section: 282 క్రైస్తవ జీవితము · Book page: 252