Song #348
క్రీస్తునందలి నా యానందము
Lyrics
రా - కళ్యాణి (చాయ : దారుణమగు మరణ) తా-ట్రిపుట
నా కింత ప్రోత్సాహా - నందంబుల్ గల్గుట -కే కర్త ఘనమైన - హేతువై
'యుందు = నాకు గల యున్నత కతమ్మే - నాధుం డగును నేను మురియు -
శ్రీకరంబగు నామ మేది - సిల్వంబద్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
1. ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - యెవరు నా కంఠంబు - నెత్తెన్
పాటలతో = ఎవరు నా పాపముల - భారము నెత్తుకొని దేవునికి నాకును -
చివరకున్ స్నేహంబు కలిపిరి - సిల్వంబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
2. నేను నా విధు లెల్ల - నిశ్చయంబుగ నెజుంగ - జ్ఞాన మిచ్చుచునుండు
జ్ఞాని యెవ్వారు = వాని యెడల నను యథార్థ - పరునిగాం గావించి యవినా
= చే నెరవేర్చించు నెవరు - సిల్వంబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
3. ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి = యెవరు నా శోకంబు - నెగురం
గొట్టిరి = ఎవరు నా హృదయంపు మూర్చను - నీడ్చి సేదను దీర్చి మనసు -
చివుకు మను గాయంబు మాన్సిరి - సిల్వంబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥
4. మరణంబులో నాకుం - జిర జీవ మెవ్నారు - మరణంబునకె గొప్పు మరణ
మెవ్వారు = విరివిలేని మహిమ సేలు - దరిని నుండంగ నన్ను జెంతను -
స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వంబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥
శ్. నన్ను రక్షింప మర-ణం బొందియు సమాధి - నెన్నటికిని గెల్చి - యున్న
ప్రభునందు = నున్న విశ్వాంసబె నాకు - నుత్సవంబును గలుగ జేయును
-చెన్నగు నా ప్రభు విం కెవ్వరు - సిల్వం బడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
-ముంగమారి దేవదాను
రక్షణానందము 281
Section: క్రైస్తవ జీవితము · Book page: 250