Lyrics
రా- ముఖారి తా-ఆది
మనసా వినవేమే - క్రీస్తుని -గని సేవింపవేమే = అనుదినమున నీ కాయువు
క్రణిం - బగుచున్నది గదవే ॥మనసా॥
1. చింతలేల నీకు - వర శ్రీ - మంతుడుండు వరకు = చెంతను జేరక
యెంతసేపు నీ - యంతట నుండెదవే ॥మనసా॥
2. లోకాశలకును - నీవు - లోకువై యుండకుము = ఆకాశము నేలెడు మన
ప్రభువును - ప్రాకటముగ నమ్ము ॥మనసా॥
3. మాయ సంతలోన - జిక్కి - మాయలం బోయెదవు = కాయము స్థిరమని
నమ్మకు మో నీ - ప్రాయము దక్శదుగా ॥మనసా॥
4 రక్షకయని వేండు - నీవు - రక్షణకై చేండు = రక్షణం బొందుట కిదియే
సమయము తక్షణమున వేండు ॥|మనసా॥
5. అందరమును గూడి - యేసుని - మందిరమునం జేరి = పొందుగ క్రీస్తుని
పౌగడుచుం బాడుచు - నందునం జేరుదము ॥మనసా॥
- జికోటయ్య
270 సువార్త
332 పాపి పశ్చాత్తాపము
అపరాధిని యేసయ్య - కృప జూపి ట్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు "అప
1. సిలువకు నిను నే గొట్టితిని - తులవలతో జేరితిని
కలుషంబులను మోపితిని - దోషుండనేను ప్రభువా "అప
2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో అప
3. ముళ్లతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ "అప
4 దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితినీ - దేహంబుగాయంబులను "అష
5. ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా "అష
6. చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత
నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా "అప
7. శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య - మోక్షంబు జూపితివయ్యా అప
-సికిపురపు కృపానందము
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 238