Lyrics
రా- ముఖారి (చాయ : భయము నొందకుము) తా-అట
ఖండింపవలెను - దుర్గుణములు - ఖండింపవలెను = ఖండింపవలెం బాప-
ముండంజూచి యేసు - నండంజేరి మన - గుండె పదిలము? జేసి ॥ఖండింప
1. ఆంధత్వమునను - రక్షణమార్గ - మందుల జేరకయు = ఎందెందు జూ
చిన - సందులేక పాప -మందు మునింగి నరలా - నందమొందక చెడిరి
॥ఖండింప॥
పశ్చాత్తాపము 269
2. ఎందు కీ భ్రమలు - నీ యందుండు - సందేహము వీడు = పొందుగ
యేసు సం-బంధు డవై యున్న - నందమైన మోక్ష - మందు జేరుట కొజకు
॥ఖండింప॥
3. జెదరక నీవు - సాతానుని - నెదిరింపవలెను = కుదురుగ నీ యేసు -
చదరునం జేరిన - వదరుబోతు లెల్ల - నెదురాడ లేరింక ॥ఖండింప॥
4 ఆసింపబోకు - లోకభోగములు - మోసమై యుండు = వాసిగ యేసుని -
దాసుండవైయున్న - గాసిం జెందక మోక్ష - దాసుండ వౌదువు ॥ఖండింప॥
5. నమ్మి జీవించు - యేసుని యందు - నెమ్మదిం బొందు = రమ్ము యేసుని
యొద్ద - సొమ్ము నీకున్చది - సమ్మతించి మదిని - నెమ్మదిగాం జూచి॥ఖండింప॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 238