FaithWalk
← Back to Songs

Song #321

పాపి విలాపము

రాగం: బిలహరితాళం: త్రిపుటఛాయ: యేసునాధ కథా సుథా✍ విజిజాక్‌ సుందరరావు

Lyrics

రా- బిలహరి (చాయ : యేసునాధ కథా సుథా) తా-త్రిపుట

ఆదరింపుము యేసువా ని - న్నాశ్రయించితి నా కికన్‌ లేదు వేరొక

'యాశ్రయంబని - లెస్సగా మది నమ్మితిన్‌ ॥ఆద॥

1. నిరతముండెడు పరమ ధనమను - నీతి జీవిత రీతిలో = పెరుగ గోరుచు

నిన్ను జేరితి - (ప్రేమ జూపుము యేసువా

2. సత్య సంధుడ లోక బాంధవ - సర్వశాంతి సుధాకర = నిత్యజీవ జలంబు

లొసగుము - నీతి నిధుల సజీవుడా ॥ఆద॥

3. ముందు వెనుకను దుష్ట శక్తుల - మూక నన్ఫరి కట్టగన్‌ = బంధితుండనైతి

నా ప - ద్భాంధవ విడిపించుమా ॥ఆద॥

4. పరమ పురమున కరుగ నేరని - పాలసుడనో రక్షకా = కరుణతో నా

మొరను గైకొని - కలుషముల నెడబాపవే ॥ఆద॥

5. పరమ ధాముడ వని యెరిగి నీ - శరణు వేడితి నో ప్రభో = తనువు

విడిచిన వేళలో నీ - తలుపు నాకై తెరువు మా ॥ఆద॥

= విజిజాక్‌ సుందరరావు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 232