FaithWalk
← Back to Songs

Song #320

పశ్చాత్తాప ప్రేరేపణ

రాగం: బిలహరితాళం: త్రిపుటఛాయ: భీకరుండౌ✍ డేవిక్‌ లైటన్‌

Lyrics

రా - బిలహరి (చాయ : భీకరుండౌ) తా-త్రిపుట

యేసు విభునిం దలంచి మదిలో - ద్వేషము లణంగింపరే = మోస విశ్వ

భ్రాంతు లెల్ల - రోసి పరిహర్షింపరే ॥యేసు॥

1. కామ క్రోధ లోభ మోహ - క్షామ గుణములు మానరే = హేమ రీతిని దేవ

కృపలో - క్షేమ మున్ఫది కానరే ॥యేసు॥

2. సత్యవేద సార మెల్ల - నిత్యము రుచిచూడరే = సత్త లేని దురిత జాలి -

బొత్తిగా విడ దీయరే ॥యేసు॥

3. కర్త కర్తయనుచు వేండి - వ్యర్థులై చెడి పోకరే = స్వార్థ చర్య లెల్ల మాని -

కర్త యేసుని బోలరే ॥యేసు॥

4. బంధు మిత్రు - శత్రు నెనరు - నిందుం జూపం బూనరే = యందమైన

మోక్ష విభవము - లందు6 గని హర్చింపరే ॥యేసు॥

ర్‌. మోక్ష వైభవ మెదలోం దలంచి - మోసమున బడిపోదురే = కక్షి సాతాన్‌

ముచ్చు వలలను - హెచ్చుగాం దెగంగొట్టరే ॥యేసు॥

సద్దులేకను దేవ సేవ - ముద్దుతో € గొని యాడరే = హద్దు మోరు విమత

సాతాన్‌ - సుద్దులను ద్యజియింపరే ॥యేసు॥

7. బాధ చేసెడి గురుల వీడుచు - బోధకుల దరిం జేరరే = నాధు క్రీస్తును

నమ్మి మోరలు - సాధులై వర్తింపరే ॥యేసు॥

-డేవిక్‌ లైటన్‌

పశ్చాత్తాపము 263

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 232