FaithWalk
← Back to Songs

Song #317

పశ్చాత్తాప ప్రేరేపణ

రాగం: ముఖారితాళం: ఆది✍ టివయా వీరవా్డన

Lyrics

రా- ముఖారి తా-ఆది

పాపము దలంచు సుమో - పశ్చా - తాపముం బొందు సుమ = దాపని

యేసుని పాదంబులబడి - పాపము వీడు సుమో ॥పాపము॥

1. పాపము చేయకు మో - యేసుని - గాయము రేపకుమి = పాయక

పాపము చేసిన మనసా - కాయండు యేసు సుమో ॥పాపము॥

2. గంతులు వేయకుమో - యేసుని - చెంతకుం జేరు సుమి = వింతంగం

థ్రీస్తుని రక్షణ్యామృత - బిందువుం గోరు సుమో ॥పాపము॥

3. ఈ ధరన్నమ్మకుమో - ఆత్మకు - శోధన లుండు సుమీ = శోధన మానెడు

క్రీస్తును నమ్మి శ్రద్ధగ నుండు సుమీ ॥పాపము॥

4. తెగువం బోరాడు సుమి- రిపునకు - జెగ్గిలవద్దు సుమీ = తెగువగు

ప్రార్థన ఖడ్గమునుం బట్టి - పగతునిం గెల్వు సుమీ ॥పాపము॥

ర. అంతము వచ్చు సుమీ - రక్షణ - అంతలో వెదకు సుమీ =అంత రంగు

డగు క్రీస్తు రక్షకుని - చెంతను జేరు సుమో ॥పాపము॥

- టివయా వీరవా్డన

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 230