Song #309
క్రీస్తు సువార్త
Lyrics
రా- ముఖారి (చాయ : ఉన్నపాటున వచ్చుచున్నాను) తా-త్రిపుట
దారుణ మగు మరణ - వారిధి దాంట నె - వ్వారి శక్యము సోదర = ఘోర
మగు కెరటములవలె వి - స్తారముగ నేరములు పైంగొని - పారు చుండునప్పు
డద్దరిం - జేరు బెట్లు దారిం గనరే ॥దారుణ॥।
1. ఒక్క పెట్టున నెగసి - చక్క వెల్ళుద మన నీ - రెక్క లకృబకు రావు =
ఎక్కడైనను నోడ గనుంగొని - యెక్కిపోద మని తలంచినం - జెక్క నిర్మితమైన
'యోడ - లకణకు రావేమి సేతుము ॥దారుణ॥
2. మంగళ ధ్వనులతో - శృంగారపురము వె- లుంగుచున్నది ముందట =
పౌంగి పారుచు మరణ నది త-రంగములం జెలంగుచున్నది భంగపడకుండి
మనకు క్రీస్తు - సువార్తయను పెను నావ యిదిగో ॥దారుణ॥
3. వాద రహితుండైన - యాది దేవుండు దాని - నాధుం డనం బరంగును =
బాధ లొందిన నరుల నందరిం - జేరందీసిన క్రీస్తు యేసు - నాధుండే నావి
కుం డు క్రైస్తవ - వేదమే చుక్కాని దీనికి ॥దారుణ॥
4 మానవు లందరు - మరణాంబుధిని దాంట - మహనీయ మగు నావ యిదె
= దీనిలో నెక్కుటకు ముందే - మానుగ వాక్యమును విని సు - జ్ఞాన
'మొందినవారు క్రైస్తవ - సాన మను పత్రికను బొందరె ॥దారుణ॥
5... విదితంబుగా నిందు - విజ్ఞాన బోదకుల్ - వినిపించుదురు వాక్యము
గౌదగొనిన యాత్మములు తృష్తిం - గౌనును బ్రభు భోజనములోనే -
హృదయములలో దేవునాత్మ - యెపుడు దీపంబై వెలుంగును ॥దారుణ॥
ఈ పలువిధ సంగీత - ములతో సాగుచు మనము - నలయ కుండంగం బోదు
'ము = బలముగల యీ - యలలు దాంటి - పరమ పురద్వారముల వెలుపల
- గలిసికొని పరిశుద్ధ జనమును - గడకు మోక్షము చేరుకొందుము ॥దారుణ॥
254 సువార్త
7. కరుణామయుని సభలోం - జొరకపోయిన నిత్య - నరక మంత మందున
మరియు నంత్య దినపు బాధలు - విరివిగ వినం గోరువారలు - మరణ
'మొందక మును ప్రత్యక్షీ - కరణ మను గ్రంథమను వినరే ॥దారుణ॥
- రావూరి దావీదు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 222