Lyrics
రా- ముఖారి (చాయ : ఉన్నపాటున వచ్చుచున్నాను) తా-త్రిపుట
పాపకూపమునందు - పడి మునిగియున్నావు - పాటింపవది యెందుకు=
పాప జన్మము పాపకర్యము - పాపపూరితమైన హృదయము - ఓపరాని
భయంకరోగ్రత - శాపములు సమకట్టియుండగ ॥పాష॥
1. పరమాత్మ మీదనే - గురి నిల్చు మని దెల్బు - వరబోధమది నెంచవు =
నిరత మును రాత్రియును బవలును - నిరవు ధనమును ఘనము సౌఖ్యము
'అరయు చుందువు క్షణము నీవా - పరమ ధర్మము సరకుజేయవు ॥పాష॥
2. కనివినంగ నుదగని - పనికిమాలిన క్రియల -దనిసి బ్రమయుచు నుందువు
= ఘనుల పెడ్డల జననీజనకుల - ననిశమును నిరసించి మెలగెడు
వినయరహితంబైన జీవిత - మునకు నేమి ఘటిల్లునోకను ॥పాప॥
3. పెరవారలను ట్రియసో - దరులుగ ట్రేమింప - పరమాత్మపురికొల్పదే -
పరులపై ద్వేషంబు పగగొని - పలుతెరంగుల బాధపఅచుచు - ప్రాణహత్య
లొనర్చు నీకు - పరమ పదము లభింపసాధ్యమె ॥పాహ॥
4. పాప పరిహారార్థ - ప్రాయశ్చిత్తము జేసి -ప్రాణమర్పించె నెవరో = ఆ
పరాత్సరు నాశ్రయించుము - శాపభారము బాపిబ్రోచును - మాపు రేపునులేని
స్వర్ణ - ప్రాప్తికల్గును నిత్యశుభమగు ॥పాష॥
ర. పాపభారము క్రింద - పడికుందు మికునే - పరగనిత్తును శాంతిని -
దాపు నకు రండంచు పతితుల - దయను బిలచెడు యేసుక్రీస్తును - పాపి
కాశ్రయుడంచు నమ్మి - భక్తితో ప్రార్థించి వేడవే ॥పాష॥
సువార్త ప్రకటన 258
6 శరణీయ వరమోక్ష - పురమందు ఘనసౌఖ్య - పరమానందము లొందుచు
= వరుల దూతల - భక్తగణముల - సరసదేవు స్మరించు భాగ్యము- గురుడు
నీకిడంగోరి పిలుచుచు - కరము జాపెను - కౌగిలింపవె ॥పాప॥
= వంతగాని వరడేశ్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 222