FaithWalk
← Back to Songs

Song #304

రక్షణ మార్గము

రాగం: సౌరాష్ట్రతాళం: ఆట✍ వలిపాక జగన్నారము

Lyrics

రా- సౌరాష్ట్ర తా-ఆట

వినరే యేసుక్రీస్తు బోధ - మదిని - గొనరే - యాతని సత్య బోధ - వినిన

యేసుని బోధ - విశ్వాసమున మీరు - గొనయెదరు నిజముగ - గొప్ప

భాగ్యంబులు ॥వినరే॥

1. దారి దొలంగియున్న - వారినెల్లను ట్రోవం - గోరివచ్చితి నంచు - కూ?

యేసువు తెల్పె ॥వినరే॥

2... మన పాపముల నెల్ల -మన కొరకు వహియించి - మన యందు దయచేతం

దన ప్రాణమర్చించి ॥వినరే॥

3. మారు మనసు నొంది - మరల రమ్మంచువే - మారు బీలుచు యేసు -

మైత్రిని దలంచుచు ॥వినరే॥

4. తన యాజ్ఞ గైకొని - తన సేవజేసెడి - మనుజుల కొసంగును -మనసున

నెమ్మిది ॥వినరే॥

5. తాను నడచిన త్రోవ - తన జనులు ట్రక్కును - తానెపుడు చేయును -

తగిన సహాయ్యంబు ॥వినరే॥

= వలిపాక జగన్నారము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 218