FaithWalk
← Back to Songs

Song #299

యేసునాధ కథా మాధుర్యము

రాగం: బిలహరితాళం: త్రిపుట✍ ప్రరుపోక్రము చౌదరి

Lyrics

రా - బిలహరి తా - త్రిపుట

యేసు నాథ కథా సుధా రస - మిదిగో పానముం జేయరే = దోసకారి

జనంబులారా - దురిత భవముల బాయరే ॥యేసు॥

1. ఇహపరంబు లెవనిచే సృజి - యింపంబడియెనా చూడరే = అసవహ యా

విభుం డవతరించెను - అతని గుణములం బాడరే ॥యేసు॥

2. “దురిత భరితుల దుష్ట “చరితుల- నరయ వచ్చెను జూడరే=స్థిరముగామది

నమ్మి యా ప్రభు - కరుణ మదిం గొనియాడరే ॥యేసు॥

3. పనికిమాలిన “వేలుపుల దెస - పరుగు లెత్తుట మానరే

కౌజు కిచ్చు క్రీస్తుని - దయకుం బాత్రతం బూనరే ॥యేసు॥

"తనువు మో

4 మరణ బలి రక్తమున మన యం -దణిని ట్రోవను వచ్చెను = కరుణతోం

బాపులం బిలుచు గురు - దరికింబోవుద మిచ్చను ॥యేసు॥

5. పరమతత్వ విధాన బోధలు - బాగుగం బ్రకటించెను = *చిరసుఖాస్పద

'పదముం గోరిన - జీవులకు వినిపించెను ॥యేసు॥

6 మరణ మొందిన కొందజికిం దా - మరలం (బ్రాణము లిచ్చెను = వర

మహాద్భుత కార్యముల ని- ద్ధర ననేక మొనర్చెను ॥యేసు॥

7. కుటిల బుద్దుల ద్రోచి సజ్జన - గోష్టి నుండుట గోరే = దిటముగను

నెమ్మదిని మోరొం - దుటకుం క్రీస్తునిం జేరరే ॥యేసు॥

- ప్రరుపోక్రము చౌదరి

"అమృతము *పాపములతో నిండియున్నవారిని. దుర్మార్గమైన ప్రవర్తనగలవారిని

“దేవతల “దేహము. ఎల్లప్పటికిని ముఖకారణమైన

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 214