Lyrics
రా - హిందూస్మాని తోడి తా-ఆది
యేసునే సేవింపరండి - మోసపోకండి - ప్రభు = దోసములను బాపు
నండి - దొడ్డ ప్రభువండి ప్రభు ॥యేసునే॥
1. దేవుం డీతండే సుమండి - దిగులుపడకండి - మన = చావు నొంది లేచెనండి
- జీవ మితండండి - ప్రభు ॥యేసునే॥
2. పాపులను ప్రేమించె నండి - ప్రాణ మిడె నండి - ప్రభు = దాపుంజేరి వేం
డ రండి - దయామయుండండి - ప్రభు ॥యేసునే॥
3. నరకబాధ నొందె నండి - నరులకొర కండి - ప్రభు = దురితములను
బాపు నండి - దుఃఖపడకండి - ప్రభు ॥యేసునే॥
సీ
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 210