Lyrics
రా - కేదారగౌళ తా- త్రిపుట
నిజముగా పరిశుద్ద్భు డొకం డీ - నేలపై లేండు = 'వృజినములచేం జెడిన
మదిని బ -విత్రమూలం బెటుల “బొడమును ॥నిజము॥
1. “దురిత లతలకు “మూలకందము - దుస్స్వభావము దానిం గూడిన -
నరులలోం బరిశుద్ధ విధు లె - న్నటికిం గనరావు = "నెరవుగా సద్ధర్మములనే
“తెబుంగుననుం 'గావింప నేర్తురు - ధరణి లోపల ముసిండి చెట్టున - చెబకు
రస ముండునె తలంపగ ॥నిజము॥
2. మనసు క్రియ లన్నిటికి మూలం - బనుచు శాస్త్రము పల్కు మణి యా -
మనసు శుచిగాకున్న నగునే - తనకు క్రియాశుద్ధి = 'అనిశ మా హృదయము
దురిచ్చల - 'నలరి *మిధ్యాసక్తి నుండంగ - ఘనతగల సత్యార్య ముల నిల -
మనుజుండె "బ్లా నరింపంజాలును ॥నిజము॥
3. నిరతమును పాపాగ్సిచేతను - గరగుచున్న మనంబులోపల - పరమ
ధర్మము భక్తి ఎటువలెం - బాదుకొని యుండున్ = నిరపరాధి యొకండు లేం
డని - నికముగం గనవచ్చుచున్నది - పరమ దేవుండు క్రీస్తు కృతమునం-
పాపులను రక్షింపవలయును ॥నిజము॥
- ఫరుషోత్తమ చౌధరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 210