FaithWalk
← Back to Songs

Song #291

శాశ్వత ధనము

రాగం: నాటతాళం: ఏక✍ వ్రలిపాక జగన్నాధము

Lyrics

రా-నాట తా- ఏక

ధరణిలోని ధనము లెల్ల - ధరణిపాలై పోవును = గరిమతోడ నీవు గైకొను

= నిరత ముండెడి ధనమును ॥ధరణి॥

1. యేసు నందు నిత్యజీవం - బిపుడు దేవు డిచ్చును = తీసికొనుము దాని

వేగము - దివ్య వరముగ నమ్మికన్‌ ॥ధరణి॥

2. విడువు నీదు పాపములను - తదవుంజేయుం బోకుమీ = విడువ కున్న

నీకుం గల్గు = వేద నాధికంబుపో ॥ధరః

3. పరుల మాటల బట్టి నీవు - పడకు మోస మందున = నరుల కొజుకు జీవ

మిచ్చిన - పరమధాముని నమ్ముమో ॥ధరణి॥

4 తలంచుకొనుమో ధరణిలోన - నిలుచు కాల మంతట = విలువలేని యేసు

ట్రేమ - విధము చక్కంగ నెజుంగుచు ॥ధరణి॥

5. దేవ కృపను బోలునట్టి - దివ్య భాగ్య మొకటియున్‌ = నీవు చూడ బోవు

మిత్ర - నేట నెచట వెదకినన్‌ ॥ధరణి॥

- వ్రలిపాక జగన్నాధము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 208