FaithWalk
← Back to Songs

Song #281

నూతన నిబంధన విందు

రాగం: భైరవితాళం: చాపుఛాయ: యేసుక్రీస్తు దొరికెనేని✍ హల్తుండ క్ఞానకాయు

Lyrics

రా- భైరవి (చాయ :యేసుక్రీస్తు దొరికెనేని) తా- చాపు

'మానవుండవై సకల నరుల - మానక నా దోషముల? - బాపుటకు బలి

యైతివే యేసూ - బహు ప్రేమతోడ |మానవుండవై

1. నీదు బలిని నిత్యముగను - నిజముగా ధ్యానించి ప్రేమను - నీదు దివ్య

ప్రేమ నొందుటకు - నియమంబు నిచ్చి ॥|మానవుండవై॥

2. నీవె జీవపు రొట్టె వంటివి - నీవె జీవ జలంబు వంటివి - నిన్ను ననుభ

వించుండంటివిగా - నిజదేవా యేసూ |మానవుండవై॥

3. నీ శరీరము రొట్టెవలెనే - నిజముగా విరువంగంబడెనే - నిన్ను దిను

భాగ్యంబు నిచ్చితివే - నా యన్న యేసూ ॥|మానవుండవై॥

4. మంచి యూట మించి దండి - పంచగాయములలో నుండి - నిత్యజీవపు

టూటలు జేసితి - నీ (ప్రేమ నుండి ॥|మానవుందవై॥

5... నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు - నీదు ప్రేమ బలిలో మనుటకు - నిత్య

మాచరించుండంటివి నీ - నిజభక్తితోడ ॥|మానవుండవై॥

6. ఎంతో (ప్రేమతో బలిగా నైతివి - యెంతో (ప్రేమాచారమైతివి - చింతలును

నా పాపములు బాప - శ్రీ యేసు దేవా ॥మానవుండవై॥

7. నిత్యబలి యగు నిన్నే నమ్మి - నిన్ను ననుభవించి నెమ్మి

నిముడించుకొని నాలో నీ- నిజరూప మొంద ॥మానవుండవై॥

8. నేను నీ బిలిలోనం గలిసి - నేను నీతోం గలిసి మెలిసి - నేను నీవలె

'నుండం జేసితివే - నా దివ్య యేసూ ॥మానవుందవై॥

9. నీదు శ్రమలను బలిని నిపుడు - నాదు కనులు చూడ నెపుడు - నాదు

పాపభారములు దిగునే - నా దివ్య యేసూ ॥|మానవుండవై॥

10. నీవు బలియై తిరిగి లేచి - నిత్య తేజోరూపు దాల్చి - నిత్యమును నా బంతి

'నున్నావే - నిజ దేవా యేసూ ॥మానవుండమై॥

11. నీవే నీ చేతులతో నిత్తువు - ఈ నీ బలివిందునకు వత్తువు - నిన్ను నిట

'జూచితిని నా యేసూ! యెన్నండును మరవను ॥మానవుండవై॥

-హల్తుండ క్ఞానకాయు

నిన్ను

ప్రభు రాత్రి భోజనము 233

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 202