Song #280
ప్రభురాత్రి సంస్మారవిందు
Lyrics
(చాయ :సోదరులారా గనుడీ యాశ్చర్యం)
చేరి భుజియింపుడీవిందు - యేసు - సిద్ధపరచిన కృపావిందు = తోరణంబగు
మేడ గదిలో - జేరి శిష్యుల తోడ సిలువ = భారమున్ మదినెంచి నెరపిన -
భావ
గర్భితమైన విందు ॥చేరి॥
రా-కేదారి తా- అట
1. జీవాహారము దైవసుతుడే - పరమ - జీవజలముల దాత యితడే =
జీవనాధుని రక్త - మేనులు - జీవానాహారములు కాగా = చావును దొల గించి
మృతులస - జీవులనుగా మార్చువిందు ॥చేరి॥
2. కారుణ్యనిధి యేసు రాజు - నరుల - గావగ బలియైన రోజు = భారమైన
సిలువ కెరయై - పాప భారము పరిహరింప = ధారవోసిన పుణ్యరక్తపు -
ధారలన్ దలపోయు విందు ॥చేరి॥
3. దాసగణముల ట్రోవనెంచి - రుధిర - ధారలను గార్చిభరించి = భాసు
రంబగు నవ నిబంధన - జేసి సంఘ పునాది వేసి = వాసి మోరగ నిత్య
జీవము - బోసినట్టి యేసు విందు ॥చేరి॥।
4... పాప పరిహారార్థముకై - క్రీస్తు - పడిన ఘోరబాధ కొరకై = యేపు దనరగ
స్తుతులుబాడుచు - యేసునాధుని రాకవరకు = ఆపకుండగ సత్రసాదము -
నందుకొని బలమొంద రండి ॥చేరి॥
క. విందుతో మొదలిడిన సేవ - యేసు - విందుతో ముగియించె ట్రోవ =
విందులోగల మర్శమేదియొ - విపులముగ బోధించు క్రీస్తున్ = డెందమున
ధ్యానించి యాయన - యందె నమ్మిక గలిగియుందము ॥చేరి॥
-౨ డి జార్ సుందరరావు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 200