FaithWalk
← Back to Songs

Song #279

ప్రభు రాత్రి భోజన మాచరించునపుడు దీవెన గోరుట

రాగం: హనేనిఛాయ: దేవా యాశీర్వదింపుము✍ మరారి దావీదు

Lyrics

రా- హనేని (చాయ :దేవా యాశీర్వదింపుము) రా - త్రిపుట

దేవా దీవించు మిష్పుడు - దీన జనాళిన్‌ - గావ రా రమ్మెల్లప్పుడు = నీ

వరగద్దెచుట్టు - నిజ దాసు లిటులం గూడి - పావన సంస్మారమును - బంచి

పాలొందుచుండ ॥దేవా॥

1. మముం గావ నైదు గాయముల్‌ - బొందిన దేవ - సముండా నీ రక్త

కాయముల్‌ = విమలంపు భక్తి ద్వారా - వీక్షించి మనసులందు - అమిత దుః

'ఖ మొందుటచే - నలిగిన భక్త జనులన్‌ ॥దేవా॥

2. నీ రాజ్యమునకు మము? జేర్ప - నిజము మా పాప - ఘోర శాపమ్ములన్‌

దీర్చ = నోరిమిచే మా కొరకు - దారుణముగ నొందిన - క్రూర మరణమును

దలంచి - కుములుచున్న హృదయులను ॥దేవా॥

3. కోరి నినుం గొలుచు భక్తుల - కోరిక లభివృద్ధి - గా రాజిలంజేయు శక్తుల

ధారాళముగ నొసంగు - ధనాత్యుండ నీ దివ్యా - కార మందుండి యీ సం

- స్మార సమయమున మమ్ము ॥దేవా॥

ప్రభు రాత్రి భోజనము 231

4 మా దారిద్యములు బాపనే - పాపభారంపు - ్రూను నీ దివ్య మూపుననే

= గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో - బాధ లొందితి వనుచు -

బహుగా దుఃఖించు మమ్ము ॥దేవా॥

5. నీవీ విధంపు మరణముచే - నిజముగా మమ్ము - జీవింపంజేసి నిల్పుటచే

= పావనదేవ మే మో - ప్రభు సంస్మారమ్ము మా మా - జీవాత్మ లాదరణకై -

జే మనముగం గైకొనను ॥దేవా॥

= మరారి దావీదు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 200