Lyrics
రా- ముఖారి (చాయ : కరుణసాగర)
దీవెనల నిడు దేవా నీదు - సేవకై వెడలెడు దీనులపైం = పావనాత్మ నంపుము
- పనులలో నడిపింపుము - కేవలంబుగ మా తనువులు నీ - సేవకై యర్చింప
గజేయుము ॥దీవెనల॥
1. మాటిమాటికి బాపయుతంబౌ - మార్గమునం జను మనసులం ద్రుంచి =
మేటి క్రీస్తుని నామా - మృతముం గ్రోలుచు మేమా - పాటున నాత్మల రక్షణకై
- పనులు సల్పంగ బంపుము కృపచే ॥దీవెనల॥
2. దివ్యబోధ లెదను గల్లి - దీనతను రక్షణ మార్గమును = భవ్యముగ బోధింపం
- బరమార్థ మెజిగింప - సేవ్య నేర్పవె దిన దినమును నీ - సేవకాళికి నీ
మర్శముల ॥దీవెనల॥
3. దురిత రోగాదులచే మిగులం - తూలి చను మనుజాళికి నీవే = పరమ
విశ్రాంతి నిడు - వరదుండ వంచుంగడు - వెరవునను బోధింపంగను నీ -
'వర ములతో నింపుము దాసులను ॥దీవెనల॥
4. గ్రామ సంఘంబులను బడుల - క్షేమముగం గాపాడి పెంప = ఓ మహాత్మ
నీకృప - తో మమ్ముం గాచి సదా - స్వామి మాలో నీవును నీలో మేము
మనగను ట్రోవు మామేన్ ॥దీవెనల॥
-వంతగాని వరదేశ్
బాప్తిస్మము
బాప్తిస్మము
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 194