FaithWalk
← Back to Songs

Song #269

బోధకులకొరకైన ప్రార్థన

రాగం: శంకరాభరణముతాళం: ఆది✍ చిరియం బెర్రి

Lyrics

రా - శంకరాభరణము తా-ఆది

అడుగుచున్నా మో దేవ - కదు దయను గావం = జెడుగుల మైన మేము

ని- న్నడుగుటకు నే బిడియ మొందము = అడుగుండి మో కిడియెద నంచు -

నాన తిచ్చిన వాగ్గానమునం గని ॥యడుగు॥

1... వేడు కలరంగం గూడి నిను గొని = యాడి యడిగెడు నీదు భక్తులం = గోడు

గని దయతోడ నెప్పుడు - వీడక నెరవేర్తు వని ని ॥న్నడుగు॥

2. సారె సారెకు నిన్ను విడిచి - ఘోర దురితపు భారమందుం = జేరి నిను

'మఅచితిమి గద మా - క్రూరత నెడ బాపు మని ని ॥న్నడుగు॥

3. దుష్టుడు మాతోడం బోరంగ - ఢ్రేష్ట మగు మానిష్ట తోడుత = కష్ట మనక

వాని గెల్వం - బుష్టిని బుట్టించు మని ని ॥న్నడుగు॥

224 క్రైప్రవ సంఘము

4 తోర మగు విశ్వాస నిరీక్షణ - కూరిమి విమలాత్మ వరములు = వారక

'హృదయాంతరంబులం - జేరిచి మము వెలిగించు మని ని ॥న్నడుగు॥

ర. మోద మొప్పంగ నీదు వాక్యము - మేదినిపై బోధపరచెడు - బోధ కులపై

శోధనంబులు - పొర్లి రాకుండాదరింప ॥నడుగు॥

6. దురితముల చే భరితు లయ్యెడు - నరులపై నీ కరుణం జూవి =

గురుతరంబగు మారు పుట్టుక - వరముం గుమ్మరించు మని ని ॥న్నడుగు॥

7. రోగములచే సేగి నొందుచు - జాగు సేయక నిను దలంచుచు = బాగు

గోరుచు నున్న భక్తుల - రోగములు వెడలించు మని ని ॥న్నడుగు॥

8. ధరణిపైని మరణ మయ్యెడు - తరుణమందో కరుణా కలితా = పరమ

పురమునందుంజేరి - వర సుఖంబు లనుభవింప ॥నడుగు॥

-చిరియం బెర్రి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 192