FaithWalk
← Back to Songs

Song #268

సభకాపరుల కొరకు ప్రార్థించుట

రాగం: కళ్యాణితాళం: ఆది✍ కడియం గాలైటేటు

Lyrics

రా- కళ్యాణి (చాయ పరిశుద్దాత్మను గోరుము) తా-ఆది

పరిశుద్ధాత్ముండ, లెమ్ము నీ - సంఘముపై నీ - వర దీవెనల నుంచుమి

చిరుత కాలపు సభ కా - పరు లొంది నీ యగ్ని - యరుల నెదిరించి చా -

టిరి నీదు సత్యంబు ॥1పరి॥

1. బలుండా యీ కాలంబునన్‌ - దివారాత్ర - ములు నీదు సేవకులున్‌ =

నలు దిక్కులను దిరిగి - విలసిల్లు నీ వార్త - పలు జనాంగములకు బ్రకటించు

చుందురు ॥పరి॥

2. ప్రతిదేశము దిప్పుడు - ఉజ్ణీవముం బడసిరి నీ బిడ్డలు = అతులుండు నీ

పుత్రం - డాజ్ఞాపించిన యట్లే - యతి తీవ్రతను వేండ అధిపా మాకొసం

గుము॥పరి॥

క్రై సేవకులు 228

3. పరిశుద్ధాత్మ బలంబును - వాక్యపు ధృతినిం - బిడసిన బోధకులను =

ఇరుల శక్తిని ద్రోసి - నరులను నీ తట్టు - మరలం జేసెడువారిం - ద్వరలోం

బంపుము దేవ ॥పరి॥

4 నీ యాత్మ కాంతితోడం - బూర్వము వలెనే - డాయంగ మముం జేయుమా

= యే యడ్డున్నను బాపి - యెలమి నింగిని జీల్చి - దాయుము మము స్వేచ్చ

- దయచేసి నీ యొద్దం ॥పరి॥

5. జను లెల్ల నీ వాక్యపు - శక్తి నెటింగి - ఘనపరపం ద్వరచేయుము = పెను

సంఘములు లోక - మున నాటి యిశ్రాయేల్‌ - జనపు నిద్రను బాపు - జయ

'మొందు నీ వాక్కు ॥పరి॥

6 ఇల సంఘమున నెడారుల్‌ - కప్పుము దేవ - తొలంగించు మాటంకము =

అల నీ వాక్యమునకు - నడ్డంబు లేమియు - గలుంగకుండంగ నిమ్ము - ఘన

'సంఘాధ్యక్షుండ- ॥పరి॥

7. నీసంఘమును నబద్ధ - బోధలనుండి - నిర్మలంబుగం గావుమా = గాసిం జేసెడు

జీత - గాండ్లను బాపి నీ - భాసిల్లు నుద్యాన - వనముగ నుంచుమా ॥పరి॥

- కడియం గాలైటేటు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 192