FaithWalk
← Back to Songs

Song #266

నిజసేవకుని లక్షణములు

రాగం: ధీరశంకరాభరణముతాళం: ఆదిఛాయ: భజన చేయుచు

Lyrics

దావీదు కీర్తన 15

రా- ధీరశంకరాభరణము (చాయ : భజన చేయుచు) తా-ఆది

'ఘన యెహోవా నీ గుడారం - బున నతిథియౌ వాడెవండు = తనర

నీ పరిశుద్ధ పర్వత - మున వసించెడు వాండెవండు ॥ఘన॥

1. వెలంయగను యథార్థ వర్తన - గలిగి నీతి ననుసరించుచు = నెలమితో

మనసార నిజము - పలుకు చుందువాండై సుమ్మ 1ఘన॥

2. తనదు నాల్మతోంగొండె మాడండు - తన సఖునకును గీడు చేయండు =

తనదు పొరుగు వానిపై నిం-దలను మోపండించు కేనియు ॥ఘన॥

3... వానికిని నీచుం డసహ్యుడు - వాండు భక్తుల గౌరవించును = హని కలిగిన

నాతండును బ్ర - మాణ మాడియు మాట తప్పడు ॥ఘన॥

4 మరియు ద్రవ్యము - వడ్డి కీయండు - నిరపరాధినిం జెజప లంచము =

అరయం డిట్టులం జేయువాండే - ధర నెపుడు గదల్పంబిడండు ॥ఘన॥

5. జనక తనయ పావనాత్మకు - ఘన మహిమయు కల్లుంగాక = మును

పిపుడు నెల్లప్పుడున్‌ యుగ - ములకు గల్గునుగాక యామేన్‌ ॥జనక॥

లైల దావీదు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 190