Lyrics
రా - మధ్యమావతి తా-ఆది
&
యెహోవ పురి పునాది - యిల - మహా స్టిరంబైనది
1... మహా సీయోను గుమ్మములు - అవి - యెహోవాకు నతిప్రియములు =
ఇంక - నిహ జను లెల్లరు గొనియాడి - నిను - బహు కీర్తింతురు పట్టణమా
॥యెహోవా॥
2. భూమిలో సర్వజనాంగముల్ - తమ - నామము లచ్చట ప్రాయన్ = ఆ -
స్వామి యెహోవా వారిన్ - అట - జన్మించిరి యని ప్రాయన్ ॥యెహోవా॥
3. పాటలు పాడి జనాంగమా - తమ - యూటలు నీ కడ గలవే = యని
స్తుతియింతురు నిను స్తుతిపాత్రా - యింక - భజియింతురు నిను నిజభక్తిన్
॥యెహోవా॥
4. ఇది కైస్తవ సంఘంబే - కడు - శుభముల నిచ్చు స్థలంబే = ధర-బుధు
లేసుని నిటం గనుచు - నతి-ముదమును బొందుట నిజమే ॥|యెహోవా॥
5. జనః కుమా రాత్మకును - నింక - ఘనమహిమలు గల్లునుగాక = ఆ -
దిని నుండిన రీతిని నిపుడు - నింక - ననవరతముండును ఆమేన్ ॥|యెహోవా॥
= నరళనమాయేలు సుబ్బయ్య
సంఘము క్రీస్తుని దేహము
(చాయ: ఓ మా తండ్రి) తా-ఏక
రా - అనందఖైరవి
యేసు దేహమైన సంఘము - ప్రభు క్రీస్తుపై విశ్వాస మమరి క్రా లెడు
జనము = యేసు ప్రాయశ్చిత్త రక్తము - దోసములను బాపు నంచు - నాసతోడ
నమ్మి తమ ప్ర - యాసములను దీర్చుకొన్న ॥యేసు॥
రా- కమాసు
2.
క్రైస్తవ సఘము 217
స్థాపకుండు యెహోవా దేవుండు - పాపులను గావ - నోపి సుతునిం బంపె
కరుణుండు = ఈ పవిత్ర సంఘమునకు - దీపము పరిశుద్ధ వేద - మేపుమిటు
శిరసు క్రీస్తు - కాపుకర్త పావనాత్మ ॥యేసు॥
వరుండు క్రీస్తు యేసునాధుని - మురువంపు వధువై - పరంగు నహ
విశేషఖ్యాతిని = సరిగెపట్టు నారచీర - లరయ నీతి న్యాయము లవి-యురుతరా
భరణముల సుం-దరము భక్తి వర్తనంబు ॥యేసు॥
తన యమూల్య రక్తముం దెచ్చి - యనురక్తుం డీమె - కనిశ శుల్క దా
నమునిచ్చి = ఘనుం డగు నా పావనాత్మ - తనకు దోడుజేసి మంచి - పని
తనమున నీమె కొక్క - భవనము గట్టంగం బోయె ॥యేసు॥
మరణ విజయుం డైన వీరుండు - మహాబ్రములపై - నరుగుడెంచు మహిమ
శూరుండు = నిరత ప్రేమ కాముం డీమె - కరముబట్టి పెండ్లి యాడం - ద్వరగ
వచ్చుం గాన భక్తి - పెరుగ బ్రతుకు టుత్తమంబు ॥యేసు॥
సంఘీభావము బలము
దావీదు కీర్తన 133
(చాయ: కొనియాడతరమే) తా-ఆది
ఎల్ల సోదరు లైక్యత - వసియించుట - యెంత మేలు మనోహరము ॥ఎల్ల॥
ధరణిలో నహరోను - తలనుండి దిగ జారు = పరిమళ డైలంబు - వలె
నద్ది తనరారు ॥ఎల్ల॥
వెలయు సీయోను కొం - డల పైకి దిగి వచ్చు = నల హెర్మోను మంచు
వలె నద్ది చెల్యారు ॥ఎల్ల॥
తరంతరం బాశీర్వా - దము నిత్య జీవంబు = స్థిరముగా నందుండ - సెల
విడెను దేవుండు ॥ఎల్ల॥
జనక తన యాత్మకును - ఘన మహిమ మగుంగాక = మును పిప్పుడున్
'యుగ - ముల కగును గా కామేన్ ॥ఎల్ల॥
- వళ్లెల దావీదు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 186