FaithWalk
← Back to Songs

Song #255

దేవుని వాక్యానందము

రాగం: మోహనతాళం: అట✍ వడుషోత్తము చౌదరి

Lyrics

రా - మోహన తా- అట

'సుఖ మిచ్చెగద మాకు - ప్రభుయేసువా నీ - సురుచిరమగు వాక్కు =

నిభిలకల్మష వనమునకు దవ - శిఖి శిఖలవలె గాల్చు నీదగు - ముఖవికాసిత

వాక్యములు బహు - సుఖము లొసంగు తవాశ్రితాళికి ॥సుఖ మిచ్చె॥

1. జగతిలోపల మెండుగ - నుండిన వివిధ - మగు శాస్త్రములు జూడంగ =

మిగుల గందరగోళమై మరి - యొకటి కొకటి విరుద్ధముగ మ -ర్వగణ కల్పిత

మగుచు నున్నవి - తగని వని ద్రోచితిమి వాటిని ॥సుఖ మిచ్చె॥

2. నీ వాక్యముల భావము - నమ్మిన పాపి - జీవుల కది జీవము = కేవలం బగు

ధర్మశాస్రము - డేవు డిచ్చిన దొకటి బైబిలు - ఈ వసుధంగల సర్వ పాపుల

బ్రోవ వచ్చిన నిన్ను: జూపెను ॥సుఖ మిచ్చె॥

- వడుషోత్తము చౌదరి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 184