Song #251
పరిశుద్ధాత్మ కుమ్మరింపు
Lyrics
'రా- ఆనందభైరవి (చాయ: రారే గొల్లవారలారా) తా-ఆది
వినరే యపోస్తలుల కార్యముల్ - క్రెస్తవు -లను వారి కవి యెంతో ధైర్యముల్
= మనసు లొకటిం జేసి - కొని యట్లు ప్రార్ధింప - ఘన ముగ విమలాత్మ -
చనుదెంచె వారిపై ॥వినరే॥
1. _ పరమండలమునుండి వచ్చెను - పెద్ద - కరువలివలె శబ్ద మిచ్చెను = తిర
ముగ వార లం- దరుం గూడి యున్న మం-దిర మెల్ల నిండె బం-ధురమై
తన్నాదము ॥వినరే॥
2. _ అనలార్చులను దీప్తి మించుచు-బీంట-లగు జిహ్వల్వలె గనుపించుచు =
ఘనముగ నొక్కొక్క - జనునిపై - నవి నిల్వం - గను బరిశుద్ధాత్మదే - తను
నింపండి రంత ॥వినరే॥।
3. _ వారన్య భాషలతోడను - నాత్మ - (ప్రేరణమును జేయు జాడను = ధారా
శముగ భాషాం-తరము లాడిరి విన్న-వారి కబ్బురమై వి = చారము ల్పొడమంగ
వినరే॥
4. ముందట వారిటుల గుంపుగ - మోద-మందుచు దేవునిం గొల్చి తా =
మందరు చూడంగ - వింత వింత పనుల - నందందు జేసిరి - దేవుని
దయచేత ॥వినరే॥
5. మనము నా రీతిగ గుంపుగాం గూడి - మన దేవుల గొల్వంగ భూమిలో
మనుజుల కాశ్చర్య - మగు కార్యములం జేయ - నొనగూడు మనసు
కా-నందమును గల్లు ॥వినరే॥
-చరుపోక్తము చౌదరి
పరిశుద్ధ లేఖనములు
252 దేవుని వాక్యము
రా - ఖరహరప్రియ తా- అట
దేవుల డిచ్చిన దివ్యవాక్య మి - దేను మన కో యన్నలారా = భావ శుద్ధిని
జేయు ఘన శుభ - వర్తమానము దీని పేరు ॥దేవుం డిచ్చిన॥
1. భయముతో భక్తితో 6 జదివినం - ప్రాపు క్రీస్తు. డటంచుం దెల్పును =
దయా మయుండగు దేవుండే మన - తండ్రి యని బోధించు నెల్లెడ ॥దేవుం
డిచ్చిన॥
2. _ సత్యశాంతము లంకురించును - సత్మియా ఫలములును బొడమును =
నిత్యజీవము గలుగు దానన్-నిస్సందేహముగ నుండును ॥దేవుం డిచ్చిన॥
3. ఈ సుమంగళ దివ్యవాక్యము-నిప్పుడే మో రనుసరించుండు = దోసములు
నెడబాసి మోక్షపుం - డ్రోవం గోరిన వారలెల్లరు ॥దేవుం డిచ్చిన॥
4. పాపములలో నుండి విడుదలం - పరమ సుఖ మని దలంతు రేనియుం =
తాప మార్చును లేచి రండి - త్వరగం క్రీస్తుని శరణు బొందను ॥దేవుండిచ్చిన॥
5. దురిత బుణములు దీర్చు మధ్య - స్థుండు గావలె నన్న వారలు = త్వరగ
రండీ త్వరగ రండీ - వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ॥దేవుం డిచ్చిన॥
6 _ మరణమునకై భయము నొందెడి - మానసము గల వార లెల్లరు = పరమ
శాంతి యొసంగు క్రీస్తుని - పజ్జ డాయంగ రండి వేగము ॥దేవుం డిచ్చిన॥
7... నిర్మలాంతఃకరణ సౌఖ్యము -నిజముగా నిలవెదకువారు = ధర్మచిత్తుండైన
క్రీస్తుని - దరికి రండి రండి వేగము ॥దేవుం డిచ్చిన॥
8. మోక్ష రాజ్యముం జేరం గోరెడు - బుద్ధి గలిగిన వార లెల్లరు = రక్ష కుండగు
యేసు నొద్దకు - రండి రండి విశ్వసించుచు ॥దేవు డిచ్చిన॥
-ప్రరుషోత్తము చౌరరి
పరిశుద్ధ లేఖనములు 213
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 180