Song #250
పరిశుద్ధాత్మునిం బొందుడి
Lyrics
రా - కళ్యాణి (చాయ: పరిశుద్ధాత్మను గోరుము జీవమా) తా - అట
పరిశుద్ధాత్మునిం బొందుము - ప్రభువిచ్చెడు - వరసహాయునిం బొం దుము
= పరిశుద్ధవర్తనకు - పరమసాహాయ్యంబు - పరముంజేరువఅకు -పరి పూర్తిగా
దొరకు ॥పరి॥
1. పరిశుద్ధాత్ముని గల్గిన - మన రక్షణ - పరిపూర్ణమై యుండును = పరమ
రక్షకుండిచ్చు - పరిపూర్ణ రక్షణను - పరమానందముతోడం- పరగంగైకొను
మిపుడే ॥పరి॥
2. _ పరిశుద్ధాత్మనిం గల్గిన - బైబిలువాక్య - పరమసారము తేటగుంన్ = పర
'మండలపుం తండ్రి - పరిశుద్దచిత్తంబు - పొరపాటులేకుండ - విరివిగాం
దెలియును ॥పరి॥
3. పరిశుద్ధాత్మునిం గల్గినం - (్రార్థనలందుం - పరమ పాటవ మబ్బును
సరిగా బ్రార్థించెడు - సరజియు6 దెలియును- వరములను బొందుటకు
తెరువులభియించును ॥పరి॥
4. _ పరిశుద్ధాత్మునిం గల్గిన - శోధనములం-పరమ విజయము గల్గును =
దురితంపు శోధనలం - దొలగింప నా ప్రభువు - పరమశక్తినొసంగి - కరుణతో
జయమిచ్చు ॥1పరి॥
'పరిశుద్ధాత్ముడగు దేవుడు 211
5. _ పరిశుద్ధాత్మునిం గల్గిన - జీవితమెల్లం-పరిశుద్ధముగ నుండును = పరిశుద్ధ
జీవితము - కరము సాధ్యంబగును - పరిశుద్దాత్మని శక్తిన్ - వర్తింపయగలమట్లు
'పరి॥
= మండపాక కేళవరాయశర్ణు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 180