FaithWalk
← Back to Songs

Song #248

పరిశుద్ధాత్ముడా - దిగిరమ్ము

రాగం: కమాసుతాళం: త్రిపుటఛాయ: చూచుచున్నాము నీ వైపు✍ చిడీ జాన్‌ సుందరరావు

Lyrics

స

రా-కమాసు (చాయ: చూచుచున్నాము నీ వైపు) తా - త్రిపుట

పరిశుద్ధాత్మా పావురమా - నీ దాసులపై - కరుణతో నరుదెంచుమా =

పరిశుద్ధుడగు యేసు - పరమున కరిగి యా - దరణకర్తగ నిన్ను - దయచేసె

గద మాకు ॥పరి॥

1. తండ్రి కుమారాత్మల - యేకాత్మవై - యుండిన పావనుడా = నిండార నీ

యాత్మ - నండగ మాకొసగి - దండిగ వరముల -దయచేయు మోదేవ ॥పరి॥

2... విధిగ వేదము జదివిన - వేమారుసద్బోధల నాలించినా = సదయుడ నీ

శక్తి - హృదయాల లేకున్న - కదలింపబడలేని -కలుషాత్ములము తండ్రి ॥పరి॥

పరిశుద్ధాత్ముడగు దేవుడు 209

3. సత్యస్వరూపా రమ్ము - మమ్ముల సర్వ - సత్యములో నడుపుము = సత్యాత్మా

నీ శక్తి-సంపత్తితో దైవ - కృత్యము లొనరింప -గ్రుమ్మరింపుమా శక్తి ॥ప[

4. _ వాక్యమందలి భావముల్‌ - లోతుగ దరచి - వచియింప దరమె మాకు =

వాక్యోప దేశివిగా - వచ్చి మాలో నిలచి - వాక్యమందలి జీవ - భావాలు

దెలుపుమా ॥పరి॥

5. సాధక బాధకముల - నిలయంబైన - సంసార సాంద్రములో= ఆదరణ

కర్తవుగా - నరుదెంచి మా సర్వ - బాధల దొలగించి - మోదంబు గూర్చుమా

పరి

-చిడీ జాన్‌ సుందరరావు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 178