Lyrics
రా - యదుకులకాంభోజి (చాయ; తనువునాదిదిగో గైకొనుమో) తా -త్రిపుట
పరిశుద్ధాత్ముండ ప్రభువ! - వరదా! మా హృదయమం - దిరముల వసి
యింపుమా = అరుదైన నీదివ్య - తరశక్తులను దాల్చి - త్వరగా మాపై దిగుమా
కరుణాబ్టినై యిపుడు ॥పరిశుద్ధాత్ముండ॥
'పరిశుద్ధాత్ముడగు దేవుడు 207
'పరమండలాగ్నివై - యరుదెంచి మా హృదయాం - తర దురితతూలం
'బును = దరికొల్సి పరిశుద్ధ పజచి మా యాత్మల మా-వరరక్షకునకు న -
ర్పణ ముగా నిడుమయ్య ॥పరిశుద్ధాత్ముండ॥
2. కాంతులీనెడు దీప - కలికవైవచ్చి మా - స్వాంతంబులంగప్పిన = యంతు
లేని యవిద్యా - ధ్వాంతంబుం జోపి సు - స్వాంతులేగెడు సత్య - సరణిం
'జూపింపుమా ॥పరిశుద్ధాత్ముండ॥
3. చలువం గూర్చెడు మంచు-జల్లురూపమున మ - మ్ముల నెల్ల దీవింపుమా.
= ఫలశూన్యంబైన యా - ఆత్మలకు నీ బల మొసంగి-ఫలవంతములుగ
గే-వలుండా యొనరింపుమా ॥పరిశుద్ధాత్ముండ॥
4. పరమ పారావతమా!-పక్షములు విప్పి మా - శీరములపైని చాంచి =
పరమందు నీ సంఘ - పరిశుద్ధులకువలెనె - ధరనున్న మాకు నీ - వరముల
నిడుమయ్య ॥పరిశుద్ధాత్ముండ॥
5. దివినుండి భువికి నా - రవముతో వీతెంచు -పవమానాకారుండవై = నవ
జన్మసంప్రాక్తికవరోధమొనరించు - భవదుఃభాంబుద పటలిం బాణం దోలుము
కృపచేం ॥పరిశుద్ధాత్ముండ॥
6. _ అందమౌ నీమోము - నందుం జిందెడు తేజ-మందళు వీక్షింపగా = విందవై
వచ్చి మా - డెందంబులకు నిత్యా - నందంబుంగూర్చి మా - వందనంబులు
గొనుమా ॥పరిశుద్ధాత్ముండ॥
-దాసరి వాన్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 176