FaithWalk
← Back to Songs

Song #236

క్రీస్తు పునరాగమనము

రాగం: రాజులకు రాజువై రారా - రాజయేసు రాజ్యమేల

Lyrics

రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా - రాజయేసు రాజ్యమేల

రారా - రవికోటితేజ యేసురారా॥

ఓ...మేఘ వాహనంబుమోద వేగమే - ఓ... మించు వైభవంబుతోడ వేగమే

॥రాజాధి॥

1, ఓ...భూజనంబులెల్ల తేరిచూడగా-ఓ...నీ జనంబు స్వాగతంబునీయగా =

నీ రాజ్యస్థాపనంబు సేయ-భూరాజులెల్ల గూలిపోవ - భూమియాకసంబు

మారిపోవ-నీ మహా ప్రభావమునవేగ ॥రాజాధి॥

2 అ

కసమున దూత లార్భటింపగా - ఆ ... ఆదిభక్త సంఘసమేతంబుగా

= ఆకసంబు మధ్యవీధిలోన - ఏకమై మహాసభజేయ - యేసునాధ! నీదు

మహిమలోన - మాకదే మహానందమౌగ ॥రాజాధి॥

3... ఓ...పరమ యెరుషలేము పుణ్యసంఘమా - ఓ... గొతీయపిల్ల క్రీస్తు

పుణ్యసంఘమా - పరమదూతలార! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా!

గొతీయపిల్ల యేసురాజుపేర - క్రొత్త గీతమెత్తి పాడరారా ॥రాజాధి॥

-ఈడినిక్యానందము

పరిశుద్ధాత్ముడగు దేవుడు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 170