Lyrics
రా - పంతువరాళి (చాయ: ఇడుగో గొజ్టెల కాపరి) తా-ఆట
కోప దినము వచ్చును - పాపుల గుండె - పగులు కాలము వచ్చును = శ్రీ పాల
యేసుని - దాపునం జేరక - మాపు రేపులు మహ - పాపులకును గొప్ప ॥కోప॥
1. భువిలో రాల కర్రల - పూజలంజేయు - చవి దేవుండ్లని చెప్పెడి = అవిగాక
తమవంటి - నరులదేవుండ్లని - యవివేకముగ నమ్ము - నరులందరికి
నెంతో ॥కోప॥
2. _ నరహంతుకులు దొంగలు - వ్యభిచారులు - మరి యబద్ధికు లందజు
ఇరుగు పొరుగు వారి - నింక మోసములు చేయు - నరులందజు చెడ్డ
'నరకములో। బడునట్టి ॥కోష॥।
3... ఆట పాటలవల్లను - పాపము చాల - వేటాదుకొను వారలు = బూట
కముల వారలు - భువిలో యక్షిణిగాండ్రు - మాటలాడక యగ్ని - మడుగులో
బడి కాలే ॥కోప॥
రక్షించుము. “తేజోవికారము. "చంద్రుడు. “సముద్రము. "ఆకాశము.
"రహస్యమైన.
198 కుమారుడగు దేవుడు
4 కులభేదములు గల్ఫ్బించి - కుటిలమందు - బలముగ బ్రతుకుచుండు =
ఇల మాయవాదుల - కింక నేమి గతిలేక - పలుగొరుకులు నుండె - బాధల
పాలయ్యెడు ॥కోప॥
5. మోంది దేవునివలనను - యియ్యంబడెడు - వేద మొక్కటి సత్యము =
ఆధారమైయుండు నాత్మరక్షణ కది - సాధులైనమ్మని భేదకులకు నెంతో ॥కోప॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 166