FaithWalk
← Back to Songs

Song #230

అంత్య దినము

రాగం: వంతువరాళితాళం: ఆది✍ వుదుపోక్తమ చౌధరి

Lyrics

రా - వంతువరాళి తా-ఆది

అయ్యో యిది యెంత దుఃఖము - ప్రభు తీర్చువేళ - నయ్యో యిది యెంత

దుఃఖము = చయ్యన యెహోవా సింహా - సనము చుట్టు వహ్ని మండు -

'నయ్యెడ విశ్వాసులకు దు - రాత్మల కగు నిత్య భేద ॥మయ్యో॥

1, తల్లి పిల్లలు గూడుదు రచటం - దండ్రి తాత లచటం గలియుదు రెల్ల కాల

'మటుల నుండ - కెడబడి మరి యెపుడు చూడ ॥రయ్యో!

2. _ అన్నదమ్ములచటం - గూడుదురు రక్క సెలియలందుం గలియుదు = రెన్నం

డు మరి చూడ రాని - యెడంగల స్థలములకుం బోదు ॥రయ్యో॥

3. _ భార్యాభర్తలు గూడుదురు రచట - బంధు మిత్రులు కలియుదురు రందు

= కార్య భేదమువలన సర్వ - కాలము మరి కూడంజాల ॥రయ్యో!॥

196 కుమారుడగు దేవుడు

4. క్రీస్తు మత ప్రబోధకులు స - స్త శిష్యులు కూడుదు రచట = వాస్తవ స్థితు

లెరుంగంబడిన - వలనను విడంబడుదు రంద ॥రయ్యో!

క్‌. శిష్టులు దుష్టులు కూడుదు రచట - స్నేహవంతు లందు గలియుదు =

రిష్టము గాని భిన్నులగుచు - నింక మరి యెన్నటికిం గూడ ॥రయ్యో॥

6. అల పిశాచి పాపు లందరు - నడుపు కర్తకు ఖిన్ను లగుచు = పలుగొరుకుల

నిత్య నరక - బాధల పాల్పడక పోరు ॥|అయ్యో॥

7. సాధు సజ్జనంబు లెల్ల - సకల దూతలతోడం గూడి = మోదముతో -

ప్రభుని వెంట - ముక్తి కేగి నిత్యులగుడు = రాహా యిది యెంత విజయము

ప్రభు తీర్పు వేళ - నాహా యిది యెంత విజయము అయ్యో!

= వుదుపోక్తమ చౌధరి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 164