Lyrics
రా - కమలామనోహరి తా-ఆది
కోలాహలముగం - గూరిమితోం గూడి - కోలాటమాడను రా రా - మా -
పాలిటి యేసుని పేరం - మాపాలిటి యేసుని పేర - మ - మ్మేలెడి దేవుని
పేరం ॥గోలాహలముగ॥
1... మాసామి యా మోక్ష - వాసుండు నైనట్టి - యేసయ్య పోకను జూడు -
'మా యేసయ్యరాకను బాడు - యేసయ్య రాకను బాడు - నీ హోసన్న - యని
మదివేడు ॥కోలాహలముగ॥
2. పాపంబులన్ మోసి - ప్రాణంబు బలి యిచ్చి - తాం బరమున కేగలేదా -
నీ - జ్ఞాపకములోనికి రాదా - జ్ఞాపకములోనికి రాదా - నీ ప్రాపకుండై
యుండలేదా ॥కోలాహలముగ॥
3. ఏలినవాడైన - యేసుని రాకను - నాలించి చూడవదేర - నిను పాలించు
వాడనుకోర - పాలించువాడనుకోర - వరి - శీలించువాడనుకోర
॥కోలాహలముగ॥
4 _ అంతములో భువి - కా యేసునాధుండు - చెంతను దూతలతోడ - బల్ -
వింతగ వచ్చును జూడ - వింతగ వచ్చును జూడ - న - త్యంత బలముతోడ
రా౭డ ॥కోలాహలముగ॥
ర. ఆకాశ భూమ్యాదు - లార్భటిలు దూతల - మూకలతోం గూడినాండు - ఈ
॥ లోకాని కేతెంచుంవాడు - లోకాని కేతెంచువాండు - ఇంక వీకతోం బ్రభుని
బాడు ॥కోలాహలముగ॥
6. భీకర సింహపు - టాకారముతోను - ఢీకొని మేఘములతోడ - బల్ -
బాకారవంబులు బాడ - బాకారవంబులు బాడ - నిటు - ఢీకొని వచ్చెను
జూడ ॥కోలాహలముగ॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 162