Song #219
క్రీస్తు లేచెను
Lyrics
రా - యమన్ కళ్యాణి (చాయ: నేనును నాయింటివారును) తా - త్రిపుట
క్రీస్తు లేచెను హల్లెలూయ - క్రీస్తు నన్నులేపును = ఇద్దియె సునాద సత్యము
- ఇలను చాటుడి నిత్యము ॥
1... మృతుల పునరుత్థాన పంటకు - ప్రథమ ఫలమగు క్రీస్తులో = మృతులు
లేతురు నేను లేతును - నాదువరుసలో నిజమిది॥
2. _ పాపమరణ నరకబలములు - ప్రభుని శక్తికి ఓడెను = పాపినగు నను ట్రోవ
క్రీస్తుని - ప్రాణదాన ప్రభావము॥
3. మరణమా! నీముల్లు యెక్కడ? - మరణమా! జయమెక్కడ? = మరణమా!
నీముల్లు విరిగెను - మహిమ క్రీస్తులో నిప్పుడు ॥
4 శిలయు ముద్రయు బలిమికావలి - గలిబిలాయెను రాత్రిలో = ఇలయు
పరమును కలుసుకొనియెను - గెలపునొందిన క్రీస్తులో ॥
5. మృతులు నీదగువారలందరు - ట్రతికి లేతురు సత్యము = ప్రేతలను
జీవింపచేయును - పృథివి క్రీస్తుని విజయము ॥
6. స్తుతియు మహిమయు ఘనత నీకె - స్తుతికి పాత్రుడ రక్షకా = స్వంత
రక్తము చిందితివి నా - స్వామి యిదెనా యంజలి ॥
- లి నూర్చ ద్రకాతూవు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 156