FaithWalk
← Back to Songs

Song #216

(ప్రభు పునరుత్థానము

రాగం: అసావేరితాళం: క్రిపుటఛాయ: ఇప్పటి నరులారా✍ జాన్‌ ఫ్రన్సీ్‌ స్పెన్సర్‌

Lyrics

రా - అసావేరి (చాయ: ఇప్పటి నరులారా) తా - క్రిపుట

విజయంబు విజయంబు - విజయంబు మా యేసు - నిజమె మృత్యువు

గెల్చి - నేండు వేంచేసె = యజమానుం డెల్ల ప్ర - యాసము లెడంబాప -

'స్వజనుల రక్షింప - సమసె సిలువమింద ॥విజయంబు॥

క్రీస్తు పునరుక్ణానము 185

1. విజయంబు విజయంబు - విజయంబు మానవుల - *వృజిన నివృత్తిని -

విభుం డొనరింపన్‌ = గుజనులచే నతండు క్రూర మరణము నొంది - విజిత

మృత్యువు నుండి - విజయుండై వేంచేసె ॥విజయంబు॥

2. విజయంబు విజయంబు - విజయంబు మా యేసు భుజము మందను

మోయు - బరిపాలనంబు = *కుజము మోందను బ్రాణ - త్యజనము జేసెను

- ధ్వజము మోయుచు సిల్వ - పాప మోడింతము ॥విజయంబు॥

3... విజయంబు విజయంబు - విజయం బింకను మా క - పజయము కాకుండం

- బ్రభు యేసు క్రీస్తు = సుజనత్వమున వైరి - “వ్రజము గెల్వంగంజేసి -

నిజముగం బరలోక - నిలయంబులో నిల్పు ॥విజయంబు॥

4. విజయంబు విజయంబు - విజయం బనెడి పాట - నిజభక్తితో మనము -

నేర్చిన వాని = భజియించుదము భూన - భములు తాం బాలించు - అజిత

జీవ ప్రదుం - డమరత్వ మిడు మనకు ॥విజయంబు॥

= జాన్‌ ఫ్రన్సీ్‌ స్పెన్సర్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 154