Song #195
క్రీస్తు శ్రమల ధ్యానము
Lyrics
రా - ముఖారి (చాయ: పాపము దలచు సుమో) తా-ఆది
ఎన్నండు గాంచెదమో - యేసుని - నెన్నండు గాంచెదమో = యెన్నండు
'జూతుము - కన్నె కుమారుని - సన్నుతి జేయుచును ॥నెన్నండు॥
1. అంధుల గాచె నంట - యెహోవా - నందనుం డితండౌనట = పొందుగల
బాపాత్ములకొర - కై తన - ప్రాణము విడిచెనంట ॥ యెన్నండు॥
2. సిరి సిలువనంట - క్రీస్తుని - జేసిరి హేళనంట = డాసిరి యూదులంట -
బల్లైము - దూసిరి ప్రక్మనంట ॥యెన్నండు॥
3... చిందెను రక్తమంట - పరమ - సంధులు దెల్పెనంట = నిందల కోర్చె నం
ట - మన దగు - నేరము గాచెనంట ॥యెన్నండు॥
4. ఆపద కోర్చెనంట - పాపపు - మోపులు మోసెనంట = కోపము మాన్చెనం
'ట - యెహోవా - కొడుకై వెలసెనంట ॥యెన్నండు॥
అక్షయుం డితండెనంట - జగతికి - రక్షకుం డాయెనంట = దీక్షగ నమ్మిన
నరులం - దరికి ని - రీక్షణ దేవుండంట ॥యెన్నండు॥
- గాబ్లవర్లి నతానియేలు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 136