FaithWalk
← Back to Songs

Song #191

సిలువ ధ్యానము

రాగం: శోకవవళితాళం: ఆది

Lyrics

రా - శోకవవళి తా-ఆది

ఎంతో వింత యెంతో చింత - యేసునాధు మరణ మంత = పంతము తో €

జేసి రంత - సాంత ప్రజలు స్వామి నంత ॥ఎంతో॥

1. పట్టి కట్టి నెట్టి కొట్టి - తిట్టి రేసు నాధు నకటా = అట్టి శ్రమల నొంది

పలుకం - డాయె యేసు స్వామి నాండు ॥ఎంతో॥

2. మొయ్యలేని మ్రూను నొకటి - మోపి రేసు వీపుపైని = మొయ్యలేక మ్రానితోడ

- మూర్చంజోయె నేసు తండ్రి ॥యెంతో॥

3. కొయ్యపై నేసయ్యన్‌ బెట్టి - కాలుసేతులలోం జీలల్‌ = కఠిను లంత గూడి

కొట్టిరి - ఘోరముగం క్రీస్తేసున్‌ బట్టి ॥1యెంతో॥

4. దాహముగొనం జేదు చిరకం - ద్రావ నిడిరి ద్రోహు లకటా = ధాత్రి ప్రజల

బాధ కోర్చి - ధన్యుండా దివి కేగి నహహా ॥యెంతో॥

5. బల్లెముతోం ట్రక్మన్‌ బొడవన్‌ - పారె నీరు రక్త మహహా = ఏరై పారె యేసు

రక్త - మెల్ల ప్రజల కెలమి నొసయు ॥నెంతో॥

కుమారుడగు దేవుడు 166

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 134