Lyrics
రా- ముఖారి (దాయ: చూడరే క్రీస్తుని) తా- త్రిపుట
వందనం నీకే వందనం - పరిశుద్ధ శిరమా - వందనం - నీకే - వందనం
= వందనం బొనరింతు నీ దౌ - నందమగు ఘన నామమునకె ॥|వందనం॥
1. సుందరుండ నీ శిరసు హేళనం - బొందె ముండ్ల కిరీట ముంచగ -
నెందు జూచిన రక్త బందులు - చిందుచుండెడి గాయములతో - గ్రందెనా -
కుమారుడగు దేవుడు 1
మోము - కుందెనా = యింక నే - నెందుం బోవక నిన్నుం గొలిచెద -
నందముగ మహిమ ప్రభావా ॥వందనం॥
2. భీకరుండ నీ యెదుట సర్వ - లోకములు వణికెడు ఘనముఖ - మే కరణి
'నుమి వేయంబడియె వి - కార రూపము నొందికందెను - శ్రీకరా = శ్రీ శు -
భాకరా = నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి - నో కరుణ భాస్మర క్షమించుము
వందనం॥
3. మించునీ ముఖ లక్షణము లహ - మంచి పెదవుల రంగుం జూడంగం
గొంచెమైనను గనుపడక కృ - శీంచి దౌడలు క్రుంగిపోవుట - నెంచంగా
నాలో - చించంగా = ఆ నీ - యంచితపు బల శౌర్యములు హ - రించి
పోయెను మరణ బలమున ॥వందనం॥
4 సిలువ యెదుటను నిపుడు నేనింక - నిలిచి నినుం బ్రార్థింతుం బ్రభువా -
ఖలుండ నని ననుం ద్రోయకుము నే - నలసి సొలసిన నిన్ను విడువక -
పిలిచెద - నిన్నే - గొలిచెద = నీ తల - బలిమి చావున వాల్చగను నా -
యేసు నినుం జేతులతో నాపెద ॥వందనం॥
శ... నిన్నునేం గొనియాడుటకు నిపు - డున్న భాషలు చాల వింక ని - న్నెటుల
నే నుతియింతునో హో - సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు - ఖిన్ఫునిం -
'జేయకు = నా కొర - కిన్ని బాధల నొందితివి నా - యన్న నా జీవంబు నీదే
'వందనం॥
ఈ మరణ దినమున భయము పడి నీ - కొర కెదురు జూడంగం గృపతో -
వరబలుండా నా విరోధుని - కరకు శరములం డ్రుంచ రావె - శూరుండా -
దేవకు - మారుండా = అటు నీ - మరణ రూపము సిలువపై నా -
తరుణమునం జూపుము యెహోవా ॥వందనం॥
= రావూరి దావీదు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 132