FaithWalk
← Back to Songs

Song #184

ఆశ్చర్యకరమైన సిలువ

రాగం: పున్నాగ తోడి =తాళం: త్రిపుట✍ ఫుడుషోత్తమ చౌధరి

Lyrics

రా - పున్నాగ తోడి = (చాయః ఎంతో సుందరమైనవి) తా - త్రిపుట

ఏమాశ్చర్యము ప్రియులారా - క్రీస్తు మరణము - (ప్రేమజూడరెమనసార =

ఆ మహాత్ముండు మరణ - మగు రీతిం గనుకొన్న - సామాన్యమగు నొక్క -

జనుని చందము గాదు = ఈ మహిని గల పాప జీవుల - పై మహాకృపం

జూపి నిత్య - క్షేమ మొసరడు కొరకు బలు శ్రమ - చే మృతుండైనాండు

స్వేచ్చను ॥ఏమాశ్చర్యము॥

1. కొండవలె భారమై - లోక పాపములు - దండింపంబడె ఘోరమై = నిండు

భారము క్రింద - నిలుచున్న వేళను - గుండె దిగులునం దనువు - నిండె

రక్తపుం జెమట = మెండుకొని దుఃఖములతో నా - తండ్రి యీ పాత్రమును

నా కడ - నుండి తొలగించుటకు మనపై - యుండినను జేయమని వేండెను

'ఏమాశ్చర్యము॥

2... కడు దుర్మార్గులచేతను - క్రీస్తుడు పట్టు - వడె దానంతట తాను =

చెడుగు లెందరు నింద - జేసి మోముపై 'నుమిసి - వడిముళ్లతో నల్ల -

బడిన కిరీటము = “తడయ “కదల బెట్టి కరముల - నడుగులను సిలువ నిడి

మేకులు - 'దాడిపి ప్రక్కను రక్తజలములు - "దొరగ “గుంతము గ్రుచ్చి రహహా

'ఏమాశ్చర్యము॥

3. ఇరు పార్య్యముల నిద్దరి - దొంగల నునిచి - మరణావస్థలం బెట్టిరి =

నిరపరాధి ప్రభువు - దురితాత్ము లొనరించు - తరుచు బాధల కోర్చి - మరి

వారిం గరుణించి = యెరుంగ రేమి యొనర్తురో యీ - దురిత జీవులు వీరి

'నోహో - పరమ 'జనక క్షమించు మని తన - 'యరుల కొరకై వేండు

కానియెను ॥ఏమాశ్చర్యము॥

- ఫుడుషోత్తమ చౌధరి

"ఉమ్మిమో. *ఆలస్యముచేయక. 'తలమీంద. “గ్రుచ్చి 'దొర్గునట్లు. “ఈటె. 'ప్రకృల

"తండ్రీ, "శత్రువులు.

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 128