Lyrics
రా - ముఖారి తా - త్రిపుట
ఎంతో దుఃఖముం బొందితినా - నాకొర కెంతో - దుఃఖము పొంది తివా =
యెంతో దుఃఖము నీకు - ఎంతో చింతయు నీకు - ఎంతో దిగులయ్యా నాకు
- ఆ - పొంతి పిలాతు యూ - దులు నీకుం బెట్టిన - శ్రమలను దలపోయం
గా ॥నెంతో॥
క్రీస్తు శ్రమలు మరణము
వచ్చిరి యూదులు - ముచ్చట లాడుచు - నెచ్చట వాండనుచు = నిన్ను -
'మచ్చరముతో వారి - యిచ్చ వచ్చినట్లు - కొట్టి దూషించినారా ॥యెంతో॥
'సుందరమగు దేహ - మందున దెబ్బలు - (గ్రంధులు గట్టినవా = నీవు -
పొందిన బాధ నా - డెందము తలంపనా - నందములే దాయెను ॥ఎంతో॥
కొట్టుకొట్టుమని - తిట్టికేల్ దట్టిని - నృట్టిట్టు నెట్టుచును = వారు -
'పెట్టుశ్రమలు తుద - మట్టున కోర్చియుం - బెట్టితివా ప్రాణము ॥నెంతో॥
నెపముం బెట్టుచుః దిట్టి - యపహసించుచు యూద - చపలులు గొట్టి
నారా = నా - యపరాధములకు నా - పదలను బొంది నీ - కృప నాకుం
జూపినావా ॥యెంతో॥
చక్కని నా యేసు - మిక్కిలి బాధ నీ - కెక్కువ గలిగె నయ్యా = ఆహా -
యొక్క దుష్పండీటె - ప్రక్మను గ్రుచ్చి తన - యక్కస దీర్చుకొనెనా॥యెంతో॥
అన్నదమ్ములైన - అక్క సెల్లెం డ్రైనం - కన్న పిత్రాదు లైన = నన్ను - ఎన్నం
డైనం ట్రేమించలే రైరి నా - యన్నా (ప్రేమించినావా ॥యెంతో॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 126